భరత్ అనే నేను సినిమా పాటల సాహిత్యం

భరత్ అనే నేను (2018) సినిమా పాటల సాహిత్యం

నటీనటులు: మహేష్ బాబు, కియారా అద్వానీ
దర్శకుడు: కొరటాల శివ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

పాటలు:

అరెరె ఇది కలలా ఉన్నదే
I Don’t Know
ఓ వసుమతి
భరత్ అనే నేను
వచ్చాడయ్యో సామీ, భరత్ అనే నేను

అరెరె ఇది కలలా ఉన్నదే

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయని: ఆండ్రియా జెరెమియా

అయ్యయ్యో కానీ జరిగిన నిజం ఇదే

నా కథలో అతను ఇదెలా నమ్మను
నా జతలో తననిలా నేనెలా చూడను
అసలు ఎం అవుతుందో ఇంకా ఇంకా అర్దమయ్యే లోపు
సుడిగాలిలా చుట్టేసింది నన్ను ఓ అందగాడి కను చూపు

అరెరె ఇది కలలా ఉన్నదే
అయ్యయ్యో కానీ జరిగిన నిజం ఇదే

ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది
అయ్యయ్యయ్యయ్యో ఇంత అదృష్టం నాకే దొరికింది
ఎన్నడు అడగనిది ఎదురుగా వచ్చింది
ఈ నిజమో నేనో రాజీ పడగా సమయం పడుతుంది

జగమే వినగా గొంతే పెంచీ చెప్పుకోవాలనుంది
కనులు కళలు మెరీసిపోయె గొప్ప వార్తే ఇది
జగమంత నన్నో యువరాణీిలా చూసే రోజు ముందుంది

అరెరె ఇది కలలా ఉన్నదే
అయ్యయ్యో కానీ జరిగిన నిజం ఇదే

అందరివాడైనా అందనివాడైనా
ఎవ్వరూ చూడని ఏకాంతంలో నాతో ఉంటాడే
తనతో నేనేనా అనిపించే పనిలోనా
ఎప్పటికప్పుడు ఆశ్చర్యం లో ముంచేస్తుంటాడే

పరదా విడని అతని మౌనం ఏం మాట్లాడకున్నా
సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచనా
మా మనసులు రెండూ మాట్టాడందే ఇంత కథ జరిగేనా

అరెరె ఇది కలలా ఉన్నదే
అయ్యయ్యో కానీ జరిగిన నిజం ఇదే

I Don’t Know

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
గాయకుడు: ఫర్హాన్ అక్తర్
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి

లెట్మీ గో లెట్మీ గో
లెట్మీ గో లెట్మీ గో

లెట్మీ లెట్మీ లర్న్ సమ్తింగ్
ఇంట్రెస్టింగ్ ఆన్ ద గో
యూనివర్స్ అనే ఎన్సైక్లోపీడియ లో
తెల్సుకున్న కొద్దిి ఉంటాయి ఇంకా ఎన్నెన్నో..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే,
ఆర్ట్ ఒఫ్ లర్నింగ్ అంటే,
నాకు తెలిసింది ఓ కొంత తెలియనిది ఇంకెంతో
ఐ డోంట్నో

ఐ డోంట్ నో నో నో
నో నో నో
నో నో నో నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో
నో నో నో ఎన్నో

ఎందుకో మరి మాటి కొక్కసారి
చెంగుమంది చేప నీటినించి ఎగిరి
కొత్తగాలిలో కొత్త సంగతేదో నేర్చుకోవడానికేమో
ఐ డోంట్ నో ఆహ్ ఐ డోంట్ నో ఆహ్

ఎన్ని సార్లు చెప్పినా గుడ్ మార్నింగ్
తగ్గదే మరి ఆ సన్ షైనింగ్
కొత్త మాటరేదో భూమినుంచి రోజు
నేర్చుకున్న వెలుగేమో
ఐ డోంట్ నో ఆహ్ ఐ డోంట్ నో ఆహ్

ఓన్లీ వన్ థింగ్ ఐ నో
దేర్ ఇస్ సో మచ్ టు నో
వాన్నా గ్రో అంటూ స్టార్ట్అయ్యే జర్నీ కి
స్టీరింగ్ ఏ ఐ డోంట్ నో

ఐ డోంట్ నో నో నో
నో నో నో
నో నో నో నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో
నో నో నో ఎన్నో

కంటి ముందరున్న అద్భుతాలు ఎన్నో
వాటిలోన ఉన్న మిస్టరీ లు ఎన్నో
ఇంత కాలం చూసి చూడకుండా
ఎన్ని వదిలేశానో

ఐ డోంట్ నో య్యా! ఐ డోంట్ నో య్యా!

క్వస్చనై ఈ నిమిషం లో
తెలుసుకుంటా తెలియనివెన్నో
నను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో
ఐ డోంట్ నో ఐ డోంట్ నో

ఆన్ ఏ బర్డ్స్ ఐ వ్యూ,
లైఫ్ ఏ లర్నింగ్ అవెన్యూ
ఎవెరీడే ఏదో నేర్పించే రెఫ్రెషింగ్ అన్థెమ్ఏ
ఐ డోంట్ నో

ఐ డోంట్ నో నో నో
నో నో నో
నో నో నో నో
ఐ డోంట్ నో నో నో
నో నో నో నో
నో నో నో ఎన్నో

ఓ వసుమతి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: రీటా, యాజిన్ నిజార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి.. ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి.. ఒ..ఓ..వసుమతి

అయ్యారే అన్ని వైపులా నన్నల్లుకుంటె నీకలా..
అందాల ప్రేమ దీవిలా అయ్యా కదా
చెయ్యందుకున్న చెయ్యిలా..
రమ్మంటే నువ్వు నన్నిలా
వందేళ్ళ పూలసంకెలై వస్తా పద
దరికి చేరవే సోకుల హార్మోనికా..

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి.. ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి.. ఒ..ఓ..వసుమతి

ఆ సూరిడుతోటి మంతనాలు చెయ్యనా
మా..టలాడి చందమామ మనసు మార్చనా
నా రోజుకున్న గంటలన్నిపెంచనా నీ కోసం

ఓ విమానమంత పల్లకీని చూడనా
ఆ గ్రహాలు దాటి నీతొ జర్నీ చెయ్యనా
రోదసి ని కాస్త రొమాంటిక్ గ మార్చనా నీ కోసం

మెరుపు తీగల హారాలల్లి
సెకనుకొకటి కానుక చెయ్యనా
వానవెల్లుని ఉంగరమల్లే మలచి
నీ కొనవేలుకి తొడిగేనా

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి.. ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి.. ఒ..ఓ..వసుమతి

ఒలె.. ఒలె.. ఒలె.. వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగెలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి

ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకనా
అందులోనె చిన్ని పూల మొక్క నాటనా
దానికేమో నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో..

నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా
నా మెళ్ళోన దాన్ని లాకెటల్లే వెయ్యనా
మా..టి మాటి కది ముద్దు ముచ్చటాడగా గుండెతో..
ప్రతొక జన్మలో ముందే పుట్టి
ప్రేమికుడిలా నీతో రానా
బ్రహ్మ గారికి రిక్వెస్ట్ పెట్టి
మరొక లోకం మనకై అడిగెయ్ నా…

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి.. ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి.. ఒ..ఓ..వసుమతి

ఓలే ఓలే ఓలే వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగెలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి

భరత్ అనే నేను

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయకుడు: డేవిడ్ సాల్మన్

విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం..

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ..
బాధ్యున్నై ఉంటానూ….
అఫ్ ద పీపుల్
ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా

దిస్ ఇస్ మీ… దిస్ ఇస్ మీ
దిస్ ఇస్ మీ…. దిస్ ఇస్ మీ

పాలించే ప్రభువుని కాననీ
సేవించే బంటును నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ….
అఫ్ ద పీపుల్
ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా

దిస్ ఇస్ మీ… దిస్ ఇస్ మీ
దిస్ ఇస్ మీ…. దిస్ ఇస్ మీ

మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ….
అఫ్ ద పీపుల్
ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా

దిస్ ఇస్ మీ… దిస్ ఇస్ మీ
దిస్ ఇస్ మీ…. దిస్ ఇస్ మీ

వచ్చాడయ్యో సామీ, భరత్ అనే నేను

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకుడు: కైలాష్ ఖేర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

ముసలి తాతా ముడత ముఖం
మురిసిపోయనే…మురిసిపోయనే
గుడిసె పాకా గుడ్డి దీపం
మెరిసిపోయనే…మెరిసిపోయనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా
రంగ రంగ సంబరంగా మోగెనే..

వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి..
ఇచ్చాడయ్యో సామి.. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.
వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ
మన కష్టం సుక్కలు కుంకుంబొట్టుగా పెట్టండి
మన కష్టం సుక్కలు కుంకుంబొట్టుగా పెట్టండి
అన్నం పెట్టే పని ముట్లే మన దేవుళ్ళు
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ
ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారే సమయం కుదిరి

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

ఓ.. మట్టి గోడలు చెబుతాయీ సీమ మనుషుల కష్టాలూ
ఈ…దారి గతుకులు చెబుతాయీ పల్లె బ్రతుకుల చిత్రాలూ
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు
మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా..
అస్సలైన పండగ ఎపుడంటే
ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా..
ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చినబోతుంది

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి..
ఓ..ఓ… ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

చేతి వృత్తులు నూరారూ చేవకలిగిన పనివారూ
చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరూ
ఎండపొద్దుకి వెలిగిపోతారూ ఈ అందగాల్లూ
వాన జల్లుకు మెరిసిపోతారూ
ఎవ్వరికన్నా తక్కువ పుట్టారూ
వీళ్ళందరిలాగే బాగ బ్రతికే హక్కు ఉన్నోళ్ళూ
పల్లెటూళ్ళు పట్టుకొమ్మ లని వట్టి జోల పాట పాడకా
తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చెయ్యాలంట

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

Leave a Comment