నువ్వే నువ్వే (2002) సినిమా పాటల సాహిత్యం
నటీనటులు: తరుణ్, శ్రియ
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: కోటి
పాటలు:
నా మనసుకేమైంది
నిద్దరపోతున్న జాబిలి
కంప్యూటర్ ఆర్ట్సు
అమ్మాయి నచ్చేసింది
ఐ అం వెరీ సారీ
సముద్రమంత
నా మనసుకేమైంది
గానం: ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిణి
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
పల్లవి :
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
చరణం : 1
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమ
జంటగా వెంట నువ్వుంటే అందదా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
చరణం : 2
ఎప్పుడు గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగ
ఎప్పుడో అప్పుడప్పుడు గురుతుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదూ కళ్లలో ఉన్నా నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవరు కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
నిద్దరపోతున్న జాబిలి
గాయకులు: శంకర్ మహదేవన్
సంగీతం: కోటి
సాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
చెలియా నీవైపే వస్తున్నా
కంటపడవా ఇకనైనా…ఎక్కడున్నా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ
చరణం : 1
ఓ… అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమనీ జాలిగా చూసే జనం..
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ
చరణం : 2
ఓ… నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని..
కదిలించలేద కాస్త కూడ నీ మన స్సుని
మరణాలు దాటి ఒక్కసారి పలకరించవేమే
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ
కంప్యూటర్ ఆర్ట్సు
గాయకులు: దేవన్, అనురాధ శ్రీరామ్
సంగీతం: కోటి
సాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
పాపం రో పాపాయి రో కోపమొద్దు బాసు..
ఈస్టుకు వెస్టుకి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు
తప్పదుగా నెమ్మది గా తీసుకోరా క్లాస్సు…
ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్సు..
కంప్యూటర్సు ఆర్ట్సూ సైన్సూ మేధ్సూ కామర్సూ.
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు
కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ..
తెలీదంటె తప్పే మిస్సూ..వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు
టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి..
మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి
ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ..
That’s the way ..we like it
That’s the way ..we like it
That’s the way ..we like it
That’s the way ..we like it
ఐస్ క్రీం లు గట్రా తింటూ హై స్పీడ్ లో లావైపోకు
డైటింగ్ పాటిస్తూ స్లిం గా వుండు
బోండం లా వున్నావ్ పండు నీ బోడీ చూస్కో ముందు
నీక్కూడ కావాలా గాళ్ ఫ్రెండు….
నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డిబేట్ మానెయ్యాలి
మగాళ్ళ పనులను మహాబ్ధుతం అని పదే పదే పొగడాలి
ప్రతీ దినం మాకోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి
దిల్లే సనం అంటూ మమ్మల్ని దీనంగ బ్రతిమాలాలి
ఆ బెట్టు కాస్త తగ్గాలి మా పట్టుదలే నెగ్గాలి
మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో వుండాలి
That’s the way ..we like it
That’s the way ..we like it
గన్నీ బేగ్ అనిపించేలా చున్నీతో చుట్టేయ్యాలా
కాస్తైన డ్రెస్సింగ్ సెన్స్ వుండాలి..
ఫన్నీగా కనిపించేల నున్నంగా షేవింగేల…
కొంచెం రఫ్ మేన్లీనెస్ ఉండాలి
ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతీ డెసిషన్ మాది
సరే సరే అని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఒకటే మీది
సరేలే పోని సరదా పడనీ అనేంత సహనం మాది
మరీ ఇలా శృతి మించారంటే కధంతా చెడిపోతుంది
మీరుడుక్కుంటే చూడాలి మా హుషారు చెలరేగాలి
మీరేడుస్తుంటే ఓదార్చే అవకాశం కావాలి
That’s the way ..we like it
That’s the way ..we like it
కంప్యూటర్సు ఆర్ట్సూ సైన్సూ మేధ్సూ కామర్సూ.
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ..ఎలాగూ తప్పని నూసెన్సు
కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ..
తెలీదంటె తప్పే మిస్సూ..వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు
టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి..
మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి
ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ..
That’s the way ..we like it
That’s the way ..we like it
అమ్మాయి నచ్చేసింది
గాయకులు: రాజేష్, కౌసల్య
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
వైశాఖమొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది
ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మంది
ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ మునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
ఏ గాలి రొజూలా వీస్తున్నా ఈవేల వేరేల వింటున్న
సన్నాయి రాగాలుగా
నా వైపు రోజూలా చూస్తున్నా ఈవాళ ఏదోలా అవుతున్న
నీ కన్ను ఏమన్నదో
నా ఈడు ఏం విన్నదో
ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా
నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా
ఎన్నెన్నొ.. అంటించి.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి
ఊరేగనీ హాయిగ
అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ళ కౌగిల్నే అందించీ
ఉరించు ఆ వేడుక
ఓ.. ఊహించనీ నన్నిలా
ఎంత గిచ్చి గిచ్చి రెచ్చ గొట్టేలా నువ్వు
ఇంక పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తొందే నువ్వు
కవ్వించి కరిగించి మరిగే వయసుని కాపాడు
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
ఓ.. ఓ.. ఓ.. ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ మునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
ఐ అం వెరీ సారీ
గాయకుడు: K.K
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
పల్లవి :
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించి శపించకే వురీ
వుంత్రాలవీ జపించి
వదిలెయ్ క్షమించి
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
చరణం : 1
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం
ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా వురి
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం
ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా వురి
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ
ప్రతీ రుతువుకో డిఫరెన్సూ
ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ వురో కలర్ రాదా
అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే
తవుషాగా ట్రైలేసి చూశానే బేబీ
అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
చరణం : 2
లిప్స్టిక్ అవసరమైనా లేనంత
ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
లిప్స్టిక్ అవసరమైనా లేనంత
ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
టొమేటో పళ్ళకి డూపుల్లా
సుమారు సివ్లూ యూపిల్లా
ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా
నన్నుండనీయకు ఊరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అది
అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
సముద్రమంత
గాయకులు: చిత్ర
సంగీతం: కోటి
సాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
సాకీ :
ఏచోట ఉన్నా… నీ వెంటలేనా…
పల్లవి :
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
ఏచోట ఉన్నా… నీ వెంటలేనా…
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
చరణం : 1
నేల వైపు చూసీ నేరం చేశావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లెపూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం
చరణం : 2
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరేవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటోలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నాప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం