అతడు సినిమా పాటల సాహిత్యం

అతడు (2005) సినిమా పాటల సాహిత్యం

నటీనటులు: మహేష్ బాబు, త్రిష
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: మణి శర్మ

పాటలు:

పిల్ల గాలి
అదరక బాధలే చెప్పెటి
అవును నిజం
నీతో చెప్పనా
పిలిచిన రానంటావా
చందమామ చందమామ

పిల్ల గాలి

సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గాయని: శ్రేయా ఘోషల్

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమేనా
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర చెసి మెరుపై తరిమెనా
ఎల్లలన్నీ కరిగి.. జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో
వేవేల వర్ణాల వయ్యారి జాన
అందమైన సిరివాన
ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేన
ఝల్లు మంటూ గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేన
ఝల్లు మంటూ గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగా
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యేనా
చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం
నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం
పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నో పలికేసరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పొగ హోరెత్తి పోతున్న గానా బజానా
చెంగు మంటూ ఆడేనా చిత్రంగా జావలీలు పాడేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

అదరక బాధలే చెప్పెటి

సాహిత్యం: విశ్వ
సంగీతం: మణిశర్మ
గాయకుడు: విశ్వ

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
అతడే అతడే అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే

లైఫ్ హాస్ మేడ్ ఇట్ స్ట్రాంగర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్డర్
హే గాట్ టు థింక్ అండ్ ఆక్ట్ ఏ లిట్ల్ వైసర్
దిస్ వర్ల్డ్ హాస్ మేడ్ హిం ఏ ఫైటర్

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదాపడితే సమరంలో గెలిచేస్తా
నే పెళపెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగధగ మెరుపై వెలుగుతూ
పెనునిప్పై నివురును చీల్చుతూ
జడి వానై నే తలబడతా

పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
చుట్టూ చీకటి వున్నా వెలిగే కిరణం అతడే
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడే

పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతూ
ఒడి దుడుకుల వల చేదించుతూ
ప్రతినిత్యం కథనం జరుపుతూ
చెలరేగే ఓ శరమతడు

లైఫ్ స్టార్టెడ్ టు బి ఫాస్టర్
మేడ్ హిం హాడ్ ఏ లిట్ల్ థింక్ స్మూదర్
హే ఇస్ లివింగ్ ఆన్ ద ఎడ్జ్ టు బి స్మార్టర్
దిస్ వర్ల్డ్ హాస్ మేడ్ హిం ఏ ఫైటర్

అవును నిజం

సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గాయకులు: K K, సునీత

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా.. అఆఅఆ
తెలిసిందే.. అడగాలా..
అడగందే.. అనవేలా..
చెవిలో ఇలా చెబితే చాల
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం

కసిరేస్తున్న మనసుకు వినపడదో ఏమో
విసిరేస్తున్న నినువిడి వెనకకి రాదేమో
నిదరోతున్న ఎదురై కనపడతావేమో
కదలాలన్న కుదరని మేలి పెడతావేమో
అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందు కొస్తే ముప్పేమో
మన సలహా మది వినదుకద
తెలుసుకదా.. ఆ ఆ ఆ ఆ
తెలిసే ఇలా చెలరేగాలా
అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం

సుడి గాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
యద ఏమందో వినమని తరుముకు రాలేనా
తప్పుకో కళ్ళుమూసుకుని
తుళ్ళి రాకే నా వెంట
వొప్పుకో నిన్ను నమ్మమని
అల్లుకుంట నీ జంట
నడపదుగా నిను నది వరద
తెలుసు కదా .. ఆ ఆ ఆ ఆ
తెలిసే ఇలా ముంచెయ్యాల

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా.. అఆఅఆ
తెలిసిందే.. అడగాలా..
అడగందే.. అనవేలా..
చెవిలో ఇలా చెబితే చాల

నీతో చెప్పనా

సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గాయకులు: S P బాలు, చిత్ర

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ …
నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాల పైపైన పడతావేం పసికూన
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికి
మోగలి మోనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి
గారం చేసిన నయాగారం చూపిన
కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా

ఒదిగున్న ఒరలోన కదిలించకే కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా
పెదవోపని పదునైన పరవాలేదనుకోన
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమారుడంటి నీ రాజాసానికి
గారం చేసిన నయాగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ…

పిలిచిన రానంటావా

సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గాయకులు: కార్తీక్, కవితా సుబ్రమణ్యం

పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా
నలుగురూ వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా..
తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావ
అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ
తటపటా ఇస్తూ వుంటావా..
సమయం కాదంటావ సరదా లేదంటావా
సరసం చేదంటావా బావా..
చనువే తగదంటావా మనవే విననంటావా
వరసై ఇటు రమ్మంటే నామాట మన్నించవా
డోలు భాజాల ఇలా నా వెంట పడతావ
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావ
డోలు భాజాల ఇలా నా వెంట పడతావ
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావ

కనులుంటే సొగసే కనపడదా
మనసుంటే తగుమార్గం దొరకదా.. రాననక
అనుకుంటే సరిపోదే వనిత
అటుపై ఏ పోరాబాటో జరగదా.. రమ్మనక
పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే
తరిమిన తాపం తాలదే మదనుడి బాణం తగిలితే
చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి
హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే
హావ హవాయి అమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి
హావ హవాయి అమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి

పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా
నలుగురూ వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా..
మొహమాటం పడతావ అతిగా
సుకుమారం చిటికేస్తే చొరవగా .. చేరవుగా
ఇరకాటం పెడతావే ఇదిగా ఆబలా
నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా.. ఆగవుగా
దరిశనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా
వరాల బాలా వారిన్చువేల తరిన్చానంటు తగువెల
నిగారమిట్ట జిగేలనల జనం చెడేల జవరాల
నిగారమిట్ట జిగేలనల జనం చెడేల జవరాల
తనాన నానే తనాన నానే తనాన నానే తననాన
తనాన నానే తనాన నానే తనాన నానే తననాన

చందమామ చందమామ

సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గాయకులు: రంజిత్, మహాలక్ష్మి

చందమామా.. చందమామా..
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా.. జంటై రామ్మా..
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
నో నో.. ఒకసారిటు చూడు
నో నో .. నీ సొమ్మేం పోదు
నో నో.. ముద్దంటే చేదా.. ఆ ఆ
నో నో.. నాతొ మాటాడు
నో నో.. పోనీ పోటాడు
నో నో.. సరదా పడరాదా
దా. దా. దా. దా
చందమామా.. చందమామా..
వింటర్ లో విడిగా ఉంటానంతావేమ్మా

వస్తు పోతూ వేధిస్తుంటే కల్లో
కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో
కల్లో ఐతే సర్లే గాని తల్లో
హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
దేఖోనా ..
సిగ్గును కొద్దిగా సైడికి ననెట్టా
ఓకేనా ఎం బాగా లేనా
దాగేనా .. కొంగుకు లొంగని సంగతులెన్నో
చూస్తున్నా వర్ణాల వానా
అంత గొప్పగా నచ్చానా.. నో నో
ఇంత చెప్పినా దౌట్టేనా.. న న న నా
ఇల్లారా కళ్ళారా చూస్తావా ఇంకా
ఎన్నో.. ఎన్నో.. ఎన్నో
చందమామా.. చందమామా..
వింటర్ లో విడిగా ఉంటానంతావేమ్మా

కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా
నీలో చాలా విద్యే ఉందే జానా
గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్నా
నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా.. తున్నా
చిత్రం గా చందన చర్చలు
చెయ్యకు నాతొ విన్నాలే శృంగార వీణ
తియ్యం గా చెంపలు మీటే కోరిక పుడితే
కానిలే నే కాదన్నానా
ఉపిరాడదే నీవొళ్ళో. నో నో
ఉండిపోకలా దూరం లో.. నో నో
ముస్తాబై వచ్చేవా
ముద్దిచ్చే ఉద్దేశం తో.. ఆహా
చందమామా.. చందమామా..
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా.. జంటై రామ్మా..
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా

Leave a Comment