ఆ నలుగురు (2004) సినిమా పాటల సాహిత్యం
తారాగణం : రాజేంద్ర ప్రసాద్, ఆమని, రాజా
సంగీతం: R.P.పట్నాయక్
దర్శకుడు: చంద్ర సిద్ధార్థ
నిర్మాత: సరితా పాత్ర
పాటలు:
ఒక్కడై రావటం
గుండెపై తన్నుతు
నలుగూరు మెచ్చిన
గుడ్ మార్నింగ్
ఒక్కడై రావటం
గాయకుడు: SP బాలు
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి ఏలా
వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళా
మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని
నీ బరువూ నీ పరువూ మొసేదీ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే యెరుగదీ యమపాశం
ఒక్క ఐశ్వర్యము కటిక దారిద్ర్యమూ హద్దులే చేరిపెలే మరుభూమి
మూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా తడికంటా నడిచేదీ ….
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
గుండెపై తన్నుతు
గాయకులు : RP, SP బాలు, ఉష
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా వధువుగా మారె మా అమ్మాయి
Wish u happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది.. అభినందనల మాల ఇదీ..
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
మనం చేసుకున్నాం అనుకుంటాం కానీ అదంతా ఒట్టిదే
Marriages are made in heaven
ఒట్టిదే పెళ్లి చేసేసి దేవుడే పంపుతుంటే
మళ్లీ ఇట్టా మేళతాళాల వేడుకే ఎందుకో
మీలాంటోల్లే నేలపై చేరి రాతలే మార్చుతుంటే
వేళాకోలం కాదు పెళ్లి అని చాటుదాం అందుకే
ఆ మూడు ముళ్ళే వేస్తే ఏడడుగులు నడిపించేస్తే కాదయ్యా కళ్యాణము
మనసులనే ముడి వెయ్యాలి నూరేళ్ళు జత నడవాలి అపుడేగా సౌభాగ్యమూ
Wish u happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది.. అభినందనల మాల ఇదీ..
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బంగారు అనేవాడు ఇప్పుడు భోషాణం అంటున్నాడు
రోజు తింటే నేతి గారైన చేదుగా మారిపోదా
మోజే తీరితే కాపురం కూడా కొట్టదా బోరుగా
ఏడే కాదా స్వరములుండేది కోటి రాగాలకైనా
కూర్చే వాడికి నేర్పు ఉండాలి కొత్తగా పాడగా
సంగీతపు సాధనలాగా సరదా పరిశోధనలాగా చెయ్యాలి సంసారమూ
ఉంటాయి కలిమి లేమి వెంటాడే కష్టము సుఖము కలబోస్తే సుఖసారమూ
Wish u happy married life
All the best for rest of life
సుందరం సుమధురం జీవితం ఓ వరం ఆటలా పాటలా సాగాలి
మంజులం మోహనం జంటగా జీవనం ఈ క్షణం శాశ్వతం కావాలి
Wish u happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది.. అభినందనల మాల ఇదీ..
నలుగూరు మెచ్చిన
గాయకుడు: SP బాలు
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోసావు
అందరూ సుఖపడే సంగమే కోరుతూ మందిలో మార్గమే వేసావు
బ్రతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం
నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
ఆ నలుగురూ… ఆ నలుగురూ…
గుడ్ మార్నింగ్
గాయకులు: SP బాలు, బాలాజీ
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
రామ రామ శ్రీ రమాపతే ఇయ్యరావయా మాకు సద్గతి
నీలకందరా హరోం హరా దారి చూపరా ఆదిశంకరా
ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం
గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం
యెద తలుపులు తెరిచేయాలి
అరమరికల తెర తీయాలి
తొలి వెలుగును ఆహ్వానించాలి.. హో
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్
ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం
గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం
వెలుగు నింపే దీపమా శక్తిని మాకీయుమా
ప్రేమ సాగరమా ప్రేరణ మీయుమా
ఏ పాపం తెలియని ఈ పాపాలను చల్లగా చూడు దేవా
నవ్వులనే పువ్వులు చేద్దాం పువ్వులనే పున్నమి చేద్దాం అల్లరితో పల్లవి పాడేద్దాం
కన్నీళ్ళకు కళ్ళెం వేద్దాం కష్టాలకు సెలవిచ్చేద్దాం ఆనందం అస్వాదించేద్దాం
మనసు అందంగా ఉంటే అంతా అందంగానే కనిపిస్తుంది కదా
హో… అందాలే విరబూసింది ఈ లోకం మన లోకం
అందామా ఇంకో రోజుకు హుందాగా ఓ వెల్కమ్(welcome)
లేరుగా ఈ లోకంలో మీకంటే అతి మంచోళ్ళు
మంచిగా పైపై నటనలు చేసే వాళ్ళే పిచ్చోళ్ళు
అరె ఆ డబ్బు పిచ్చి అధికార పిచ్చి ఓరయ్యో మనకొద్దురా
నరజాతిని పీడించే విద్రోహ పిచ్చి విధ్వంస పిచ్చి విద్వేష పిచ్చి ఈ కోటలో రద్దురా
పరమాత్మలు మీరేరా యారో
నవ్వండి నవ్వండి మాక్కూడా నేర్పండి
సెలవంటూ వీడ్కోలిచ్చి వెళ్ళాడు సూరీడు
ఆ పక్కన భూమిని నిద్దర లేపాడు లేపాడు
ఈ మాపటి చీకటి చూసి భయపడడం ఇక మానేసి కల కందాం రేపటి ఉదయాన్ని
డోంట్ వర్రీ బి హ్యాపీ (Don’t worry be happy)
అందరికీ శుభరాత్రి
సెలవంటూ వీడ్కోలిచ్చి వెళ్ళాడు సూరీడు
ఆ పక్కన భూమిని నిద్దర లేపాడు లేపాడు