బొమ్మరిల్లు (2006) సినిమా పాటల సాహిత్యం
దర్శకుడు: భాస్కర్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: సిద్ధార్థ్, జెనీలియా
పాటలు:
బొమ్మని గీస్తే
కానీ ఇప్పుడు
We Have a Romeo
అప్పుడో ఇప్పుడో
నమ్మక తప్పని
లాలూ దర్వాజా
బొమ్మను గీస్తే
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: గోపికా పూర్ణిమ, జీన్స్ శ్రీనివాస్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
బొమ్మను గీస్తే నీలా వుంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదాపడితే తప్పేముంది
ఇవ్వాలనే నాకు వుంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది
చలిగాలి అంది చెలికి వణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిను అల్లుకు పొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండి
శ్రమపడిపోకండి తమ సాయం వద్దండీ
పొమ్మంటావే బాలిక వుంటానంటే తోడుగా
అబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద
ఏం చెయ్యాలమ్మ నీలో ఏదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది
అందంగా వుంది తనవెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జాణకీ
అయ్యో అలుపు దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచుంది
నా మనసు ఎపుడు కలలే కంటుంది
కని ఇప్పుడు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు .. ఉఉమ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు .. ఉఉమ్
ప్రేమకోసం ఏకంగా తాజ్ మహలే కట్టాడు
షాజహానుకి పనిలేదా అనుకున్నాను
ప్రేమకన్నా లోకంలో గోప్పదేది లోకంలో లేదంటూ
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను
ఓహ్ ఓహ్ ఓహ్ అరేయ్ ఇంతలో ఏదేదో జరిగిందిరో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నేకూడా తడిసానురో
ప్రేయసి ఊహల్లో లైఫ్ అంతా గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను
కానీ ఇప్పుడు .. ఉఉమ్
గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను
కానీ ఇప్పుడు .. ఉఉమ్
గాలిలోన రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను
మాటిమాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను
ఓహ్ ఓహ్ ఓహ్ అది ప్రేమని ఈరోజే తెలిసిందిరో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో
ఓ చూపులతో మొదలై గుండెల్లో కొలువై
తికమక పెట్టేదొకటుందంటే నమ్మనేలేదు
కానీ ఇప్పుడు .. ఉఉమ్
నీకోసం పుట్టి నీకోసం పెరిగే
హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు
కానీ ఇప్పుడు .. ఉఉమ్
ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కణ్ణే ఎందుకు మిస్ అయ్యాను
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ రోజులా ఏ రోజూ అవలేదురో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నేకూడా తడిసానురో
We Have a Romeo
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: రంజిత్, ఆండ్రియా జెరెమియా
సాహిత్యం: చంద్రబోస్, ఆండ్రియా (ఇంగ్లీష్ లిరిక్)
హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ వుందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ వున్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు కల ఉంటే సరే
మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే
సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవరో
we have a romeo we need is a juliet
చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరీ ఎందుకురా
సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా ఎప్పుడూ ఎంగేజే రా
టీవీ anchor దేఖోరా ఆ వంకర భాషకు దండంరా
టాటా గారి బేటి రా అది రూపి రూపం రా
ఏం కావాలో.. తనలో క్వాలిటీ ఓ.. ఇంకా నీలో.. లేదోయ్ క్లారిటీ ఓ..
తేల్చేలోగా వయసవుతుంది కనీసం నూటొకటి
Yo yo yo we have a romeo all that we need is a juliet – 2
I can give you a reason to stay if you can see in me
Your life your dreams realize don’t walk away
Can’t you see what you’re leaving behind
అందరు గమనిస్తూ వుంటే ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట గాని వస్తుంటే తలనే నిమరాలి
కొంచెం కోపం ఓ.. కొంచం జాలి ఓ..
కొంచం స్వార్ధం ఓ.. కలిసుండాలి ఓ..
నన్నే నాకు కొత్తగా చూపే యువరాణే కావాలి
అపుడో ఇపుడో
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: సిద్దార్థ్
సాహిత్యం: కులశేఖర్, అనంత్ శ్రీరామ్
పనినిససా….గమపనిని
గరిగమగా…గసరిగరీ సనిసా…
నిస గరిస నిస నినిప
నిస గరిస పామపమ గారిస
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో
మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో
నా ఊహల హాసిని
మదిలో కధలా మెదిలే
నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనసందే
నువ్వే నేనని(అపుడో)
తీపికన్న ఇంకా తీయనైన
తేనె ఏది అంటే
వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన
చోటే ఏమిటంటే
నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో వుందని అంటానే(అపుడో)
నన్ను నేనే చాల తిట్టుకుంటా
నీతో సూటిగా ఈ మాటలేవీ
చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా
ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావంటే
నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే(అపుడో)
నమ్మక తప్పని
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: సాగర్, సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా ఓ
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే వున్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన ఓ
కన్నులు తెరిచే వున్నా నువ్వు నిన్నటి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలోనే వున్నా
ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన
గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన
ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అలా వెనుదిరిగిన చెలిమి అల
తడి కనులతో నిను వెతికేది ఎలా
ఈ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా
సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా
ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా
లాలూ దర్వాజా కదా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: మురళి, నవీన్, ప్రియా ప్రకాష్
సాహిత్యం: కులశేఖర్
లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా
ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ గాధలొకటే ఊరువాడ లేవైనా
గోవిందా గోవిందా ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దొళ్ళంతా తప్పులెంచుతారా
గోపాలా గోపాలా ఏందయ్యో ఈ గోల ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా
అయితే ఇప్పుడు ఏంటంటార్రా
love makes life beautiful hey Love makes life beautiful
కన్ననాడు అడిగామా పెంచటానికడిగామా
గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినామా
మేము కాదు అన్నామా వేలు ఎత్తి చూపామా
కమ్మనైన మీ కన్న ప్రేమలో వంకలెతుకుతామా
అంత గౌరవం మాపై వుంటే ఎందుకింత డ్రామా
ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తు రామా
పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా
వంద ఏళ్ళ మా జీవితాలకే శిక్ష వేసుకోమా
అందుకే Love makes life beautiful hey Love makes life beautiful
వేణుగాన లోలా వేగముగా రారా నిలిచెను ఈ రాధ నీ కోసమే
వెన్నదొంగ రారా ఆలపించవేల పలికెను నోరార నీ నామమే
పొన్న చెట్టు నీడలోన కన్నె రాధ వేచి వుంది
కన్నె రాధ గుండెలోన చిన్ని ఆశ దాగివుంది చిన్ని ఆశ దాగివుంది
అరెరరే
ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు
ఈడు వేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు
లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకరేస్తారు
ప్రేమ జంటని పెద్ద మనసుతో మీరు మెచ్చుకోరు
ఎంత చెప్పినా మొండి వైఖరి అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు
కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము
Love makes life beautiful hey Love makes life beautiful