జెంటిల్ మేన్ (1993) సినిమా పాటల సాహిత్యం
దర్శకుడు: శంకర్
సంగీతం: A.R.రెహమాన్
తారాగణం: అర్జున్, మధుబాల
పాటలు:
నా ఇంటి ముందున్నా
కొంటెగాణ్ణి కట్టుకో
చికుబుకు
ముదినేపల్లి మడిచెలో
మావేలే మావేలే
నా ఇంటి ముందున్నా
గాయకులు: S.P. బాలు, సుజాత
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: A. R. రెహమాన్
నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..
నువ్వేనా ప్రాణమే..(నా ఇంటి)
నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట..
మనసార చేరే వేళ మౌనాలే తగదంట..
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట..
వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట..
ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో..
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనో..
ఈడే సద్దు చెసెనో..
నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..
నేనే నీ ప్రాణమే..(నీ ఇంటి)
గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది..
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది..
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను..
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను..
ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి..
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి..
మ్ హుమ్ మ్..పరవశమే..(నా ఇంటి)(నీ ఇంటి)
కొంటెగాణ్ణి కట్టుకో
సంగీతం: AR. రెహమాన్
గాయకులు: S.P. బాలు, S. జానకి
సాహిత్యం: రాజశ్రీ
కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు
అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే(2)
చిన్నారి మైనా చిన్నదానా
నే గాలం వేసానంటే పడి తీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనిదేదీ లేదే
కొనచూపుతోనే వేసావు బాణం
రేపావు నాలో నిలువెల్లా దాహం
కొరగాని వాడితో మనువు మధురం
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం చెలరేగే అందం
నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట
చికుబుకు
సంగీతం: A. R. రెహమాన్
గాయకులు : సురేష్ పీటర్స్, జి.వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: రాజశ్రీ
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది ఓకే అంటే గుబులే
దీని చూపుకు లేదు హే భాష
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జన ఘోష
కొంగు తగిలితే కలుగును శోష
అహ సైకిలెక్కి మేమొస్తుంటే
మీరు మోటర్ బైకులే చూస్తారు
అహ మోటర్ బైకులో మేమొస్తే
మీరు మారుతీలు వెతికేరు
అహ జీన్స్ పాంట్సులో మేమొస్తే
మేరు బాగి పాంట్సుకై చూస్తారు
అహ బాగి పాంట్సుతో మేమొస్తే
మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏమి కావాలో మాకు అర్ధం కాలేదే
పూలబాణాలేసామే పిచ్చివాళ్లైపోయామే
మాకాటపాటలో అలుపొచ్చే
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చె
మా మతులు చెదిరి తల మెరుపొచ్చె
రాదులే వయసు మళ్ళి
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు
రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్ళిళ్ళు
ఎందుకీ గోల మీకు
మీరు ఇప్పుడే లవ్ చేస్తే
మూడు ముళ్ళు పడనిస్తే
కన్న వాళ్ళకి అది మేలు
చిన్నవాళ్ళకు హ్యాపీలు
ముదినేపల్లి మడిచెలో
సంగీతం: A. R. రెహమాన్
గాయకులు: సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గుడి శుభ
సాహిత్యం: రాజశ్రీ
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా(2)
బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లె నడిచావే
నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి
నన్నీడ నిలిపేనే
కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట
చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట
పగలు రేయి నీతో ఉంటా ఉన్నావంటే అది తప్పంతా
కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే వేస్తావే
తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట
నోటి పంట కాదంట పాడిపంట చూడంట
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట
అందం చందం నీకే సొంతం
వెన్నెలలోనే ఏసా మంచం
పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం
మావేలే మావేలే
గాయకులు: మిన్మిని, కోరస్
సాహిత్యం: రాజశ్రీ
సంగీతం: A. R. రెహమాన్
మావేలే మావేలే పరువాలు మావేలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు
అరె వా మావయ్య…
పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు
చెప్పొద్దు చెప్పొద్దు ఆ మాటలు చెప్పొద్దు
చిలకే ఎగిరొస్తే విదిలించి పోవొద్దు
రావద్దు రావద్దు మళ్ళి మళ్ళి రావద్దు
పూచే పూలన్నీ పూజలకే వాడద్దు
పడుచుకి పూవందం మరిచిపోవద్దు
లక్షలు అడిగేనా లగ్నం అడిగేనా
ముహూర్తం పెట్టించు రేపో మాపో
పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు
పెట్టొద్దు పెట్టొద్దు కొత్త రూలు పెట్టొద్దు
కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దు
పాడొద్దు పాడొద్దు హద్దు మీరి పడొద్దు
చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే
దొరికి దొరకనట్టు జారిపోవద్దు
పగ్గం వెయ్యొద్దు పరువాలకికముందు
అనుభవించాలి నేడే నేడే