జీన్స్ సినిమా పాటల సాహిత్యం

జీన్స్ (1998) సినిమా పాటల సాహిత్యం

తారాగణం: ప్రశాంత్, ఐశ్వర్యారాయ్
దర్శకుడు: శంకర్
సంగీతం: A. R. రెహమాన్

పాటలు:

కొలంబస్ కొలంబస్
కన్నులతో చూసేవే
హైరా హైరా హై రాబా
ప్రియా ప్రియ చంపోడే
పువ్వుల్లో దాగున్నా
రావే నా చెలియా

కొలంబస్ కొలంబస్

గాయకులు : AR రెహమాన్
సాహిత్యం : AM రత్నం, శివ గణేష్
సంగీతం: A. R. రెహమాన్

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి(కొలంబస్)
సెలవు సెలవు సెలవు
కనుగొను కొత్త దీవి నీవు(2)(కొలంబస్)(సెలవు)
శని ఆదివారాల్లేవని అన్నవీ ఓహో
మనుషుల్ని మిషన్లు కావద్దన్నవీ
చంపే సైన్యమూ అణు ఆయుధం
ఆకలి పస్తులు dirty polytics
pollution ఏదీ చొరబడ లేని
దీవి కావాలి ఇస్తావా కొలంబస్..

వారం అయిదునాళ్ళు శ్రమకే జీవితం
వారం రెండునాళ్లు ప్రకృతికంకితం
వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు
మనస్సులు చక్కబెట్టు
మళ్ళి పిల్లలౌతాం వలలంటా ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే
ఒంటికి తొడిగి పైకెగురు
పక్షులకెన్నడూ passport లేదు
ఖండాలన్నీ దాటెళ్ళు
నేడు విరామమేగవద్దు అయినా
విశ్రమించలేదు
నేడు నిర్వాణా చేపలల్లె ఈదుదాం..
కొలంబస్…..(కొలంబస్)

నడిచేటి పూలను కొంచెం చూడు
నేడైనా మడిమణిగాను లవ్వరైతే చాలు
అల నురుగులు తెచ్చి
చెలి చీరే చెయ్యరారాదా
నెలవంకను గుచ్చి
చెలి మెడలో వెయ్యరారాదా
week end ప్రేయసి OK అంటే ప్రేమించు
timepassing ప్రేమలా
పూటైనా ప్రేమించు
వారం రెండు నాళ్ళు వర్ధిల్లగా
కొలంబస్….(కొలంబస్)

కన్నులతో చూసేవే

గాయకుడు: నిత్యశ్రీ మహదేవన్
సాహిత్యం: ఏఎమ్ రత్నం, శివ గణేష్
సంగీతం: A. R. రెహమాన్

పాపమ పనిపమ పనిపమ గమపా||2||
సగసని పనిపమ గమగసగమ ||2||
తడక తడక తక ధిమ్, తడక తడక తక ధిమ్,
తడక తడక తక ధిమ్,తక ధిమ్ ||2||
కన్నులతో చూసేదీ గురువా,
కనులకుసొంతమౌనా కనులకు సొంతమౌనా
కన్నుల్లో కనుపాపై నీవు నను విడిపోలేవూ
ఇక ననువిడిపోలేవూ ||తడక||
జల జల జల జల జంట పదాలు
గల గల గల గల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే
విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరంలేదు రెండేలే రెండు ఒకటేలే
ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్ తాని తొందిరతాని దినతోం||౨||
రేయీ పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే
కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే
తడక తడక తక ధిమ్, తడక తడక ధిమ్ || కన్నులతో||
క్రాంచ పక్షులు జంటగ పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును విడలేవూ, వీడి మానలేవూ
కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేర్చును పొంగేనా ప్ర్మ్ చిందేనా
ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్ తాని తొందిరతాని దినతోం
ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం
తాళికొకరు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం ||కన్నులతో||
మమగగ మమసస గగససగగనిని సగగ సమమ సగగ
సపప సగగ సనిని సగగససా నిదపమగా గమపని
సగా రిసా సానిదపా మగారీ సగమ ||కన్నులతో||
పపనినిసాస గగమమ పపనిని సాస నిసగమపని
దపమా గామ పని సగరిప నిసమగరిసనిద
రీరీసనిస రిరిస సరిరినిని సాస గరిస నిసగరిసని
దప పాప నిదప మగసరి నిసగా, సగమ గమపా
నిదపప మపనీ పపని సగరిస
గరిసని సానిదపా మగమపమ ||కన్నులతో||

హైరా హైరా హై రాబా

గాయకులు: ఉన్ని కృష్ణన్, SP. పల్లవి
సాహిత్యం: ఏఎమ్ రత్నం, శివ గణేష్
సంగీతం: A. R. రెహమాన్

హైరా హైరా హైరబ్బా(4)
ఫిఫ్టీ కెజి తాజ్ మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచిన నందవనం నాకే నాకా
హైరా హైరా హైరబ్బా(2)
హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
పట్టు పూవా పుట్ట తేనె
నే నడుం సగం తాకనివ్వవా(హై ర)

కలిసి ఇద్దరం చిరునడకలతో
అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రటి తివాచి పరచి
ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లీకి బైరన్ కు సమాధి
నిద్దర చెడగొడదాం
నీలకాశమే దాటి ఎగరకు
ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు
ఏమైనదో నీ వయసుకు
ఆయసమో ఆవేశమో
పైర గాలికి వయసాయే
నేల తల్లికి వయసాయే
కోటి యుగాలైనాగాని
ప్రేమకు మాత్రం వయసైపొదుఈ(హైరా)

చెర్ర్రి పూలను దోచే గాలి
చెవిలో చెప్పెను ఐ లవ్ యు
సైప్రస్ చెట్లలో దావూద్ పక్షి
నాతో అన్నది ఐ లవ్ యు
నే ప్రేమనే నువ్వు తెలుపగా
గాలులు పక్షులు
ప్రేమ పత్రమై కుమిలినవో
వొంటి కాలితో పూవే నిలిచెను
నీ కురులలో నిలిచేందుకే
పుమాలవో పూవెట్టనా
చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే
ముద్దడగా నేను నిన్ను ముద్దాడనా
హృదయ స్పందన నిలిచినను
ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్ను నువ్వీడితే
మరుక్షణం ఉండదు నా ప్రాణం(హై ర)

ప్రియా ప్రియ చంపోడే

గాయకుడు: శ్రీనివాస్
సాహిత్యం: ఏఎమ్ రత్నం, శివ గణేష్
సంగీతం: A.R.రెహమాన్

ప్రియా ప్రియా చంపొద్దే..నవ్వి నన్నే ముంచొద్దే..
చెలీ..కన్నులతో హృదయం కాల్చొద్దే..
అయ్యో..వన్నెలతో ప్రాణం తీయొద్దే..(ప్రియ)

చెలియా నీదు నడుమును చూసా..అరెరే బ్రహ్మెంత పిసనారి..
తల పైకెత్తా కళ్ళు తిరిగిపోయే..ఆహా అతడే చమత్కారి..
మెరుపును తెచ్చి కుంచగా మలిచి రవి వర్మ గీసిన వదనమాట..
నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట..
భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట..
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట..(ప్రియా)

చంద్రగోళంలో oxygen నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా..
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా..
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జో కొడతా..
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా..
పంచవన్నె చిలుక జలకాలాడగా మంచు బిందువులే సేకరిస్తా..
దేవత జలకాలాడిన జలమును గంగా జలముగా సేవిస్తా..(ప్రియా)

పువ్వుల్లో దాగున్నా

గాయకులు: ఉన్నికృష్ణన్, సుజాత
సాహిత్యం: ఏఎమ్ రత్నం, శివ గణేష్
సంగీతం: A.R.రెహమాన్

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం..
ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం..
వేణువులో గాలి సంగీతాలే అతిశయం..
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం..
అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం..
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం..(పువ్వుల్లో)

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నై..
పూలవాసనతిశయమే..
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా..
వాన నీరు అతిశయమే..
విద్యుత్తే లేకుండా వ్రేలాడే దీపాల్లా
వెలిగేటి మిణుగురులతిశయమే..
తనువున ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే..
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం..(పువ్వుల్లో)

అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చే..
నీవే నా అతిశయమే..
జగమున అతిశయాలు ఏడైనా..ఓ.. మాట్లాడే పువ్వా ను
ఎనిమిదవ అతిశయమే..
నింగి లాంటి నీ కళ్ళు,పాలుగారే చెక్కిళ్ళు..
తేనెలూరే అధరాలు అతిశయమే..
మగువ చేతి వేళ్ళు అతిశయమే..
మకుటాలంటి గోళ్ళు అతిశయమే..
కదిలే ఒంపులు అతిశయమే..
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు
ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం..(పువ్వుల్లో)

రావే నా చెలియా

గాయకులు: హరిణి, కృష్ణరాజ్, సంగీత, సోను నిగమ్
సాహిత్యం: ఏఎమ్ రత్నం, శివ గణేష్
సంగీతం: A.R.రెహమాన్

మాణిక్య వీణా ముపలాలయంతేం మదాలసా మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలాద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం
మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాసాంకుశ పుష్పబాణహస్తే

రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి
మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లికన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం
ఏ అవ్వా నా గువ్వా
నువ్వింకా అందం దోచెయ్యి

jeans ప్యాంటు వేసుకో lipstick పూసుకో
నిజమైన తల మెరుపు డై వేసి మార్చుకో
ఓలమ్మో ఏమి చోద్యం నా వయసే సగమాయె
క్లింటన్ నెంబర్ చేసిస్తాను
గలగలమంటూ ఐ లవ్ యు నువ్ చెప్పెయ్యి
నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డ్ అని చెప్పెయ్యి

కంప్యూటర్ పాటలకు పులి వేషం నువ్వాడు
M టీవీ ఛానల్ లో శక్తి స్తోత్రం నువ్వు పాడు
two piece డ్రెస్సేసి సన్ బాత్ చెయ్ భామ్మా
డిస్నీ లాండు కళ్ళాపు చల్లి
బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం రా భామ్మా
రోడ్డు మధ్యన కొట్టే పెట్టి గారెలు వేసి అమ్ముదామా

Leave a Comment