ఖడ్గం సినిమా పాటల సాహిత్యం

ఖడ్గం (2002) సినిమా పాటల సాహిత్యం

దర్శకుడు: కృష్ణ వంశీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, రవితేజ

పాటలు:

ముసుగు వెయ్యొద్దు
నువ్వు నువ్వు
మీమ్ ఇండియన్స్
ఆహా అల్లరి
ఖడ్గం ఖడ్గం
గోవిందా గోవిందా

ముసుగు వెయ్యొద్దు

గాయకులు: కల్పన
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప: ముసుగు వెయ్యద్దు , మనసు మీద
వలలు వెయ్యద్దు వయసుమీద(౨)
ఎగరనివ్వలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తపు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరుగా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటె ఏంటిరా ||ముసుగు||
చ: సూర్యుడైనా చూపగలడా రెయిచాటున్న రేపుని
చీకటైనా ఆపగలడా వచ్చేకలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ
అన్నో అందాలు స్వాగతిస్తూ కళ్లముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటేఎలా
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు ||ముసుగు||
చ: కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా
కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదురా
నిన్న లేవైనా గురుతుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ
నీవెవరో నేనెవరో ఓ క్షణాన కలసి నడుద్దాం
సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం ||ముసుగు||

నువ్వు నువ్వు

గాయకులు: సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప: నువ్వు…నువ్వు…నువ్వు నువ్వు, నువ్వు…నువ్వు …నువ్వు….
నువ్వు…నువ్వు..నువ్వు,నువ్వు…..నువ్వు…నువ్వు…నువ్వు…
నాలోనే నువ్వు నాతోనేనువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నా ఒళ్లంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ… మెగ్గల్లే నువ్వు…ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ… పొద్దుల్లో నువ్వు ప్రతినిముషం నువ్వూ ||నువ్వు||
చ: నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నాప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు
నాప్రియ శత్రువు నువ్వూ….నువ్వూ….
మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వూ… నువ్వూ… ||నువ్వు||
చ: నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ….నువ్వూ….
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ…నువ్వూ…. ||నువ్వు||
మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వూ….
నా పంతం నువ్వు….నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ… ||నువ్వు||

మీమ్ ఇండియన్స్

గాయకులు: హనీ
సాహిత్యం: శక్తి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాకీ: తికమకపెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం….
అలాగ వుంటాం…. ఇలాగవుంటాం..ఆకతాయిలం మేము
డైలాగ్: చెప్పేదేదో అర్ధమయ్యేట్టు చెప్పరా!…అరెభాయ్…ఇస్ర్టెటుగానే చేస్తా …ఇసుకో…
ప: సత్యం పలికే హరిశ్చంద్రులం(2)…అవసరానికో అబద్దం
నిత్యంనమాజు పూజలు చేస్తాం…రోజూ తన్నుకు చస్తాం ||సత్యం||
నమ్మితే ప్రానాలైనా ఇస్తాం …నమ్మడమేరా కష్టం
అరె ముక్కుసూటిగా వున్నది చెప్తాం..నచ్చకుంటే మీ ఖర్మం
అరె కష్టమొచ్చినా…కన్నీళ్ళొచ్చినా…చెదరని నవ్వుల ఇంద్రధనుసులం….
మేమే …ఇండియన్స్…మేమే …ఇండియన్స్… మేమే …ఇండియన్స్… అరెమేమే …ఇండియన్స్… ||మేమే||
చ: వందనోటు జేబులో వుంటే నవాబునైజం పర్సుఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం
కళ్లులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచుపోరి ఎదురుగ వస్తే పళికిలిస్తాం
ప్రేమా కావాలంటాం …పైసా కావాలంటాం ..ఏవోకలలేకంటాం …తిక్కతిక్కగా వుంటాం
ఏడేళ్ళయినా టి.వి.సీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళిరికార్డు డాన్సింగ్ చెస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికో టేస్తాం
అందరుదొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తాం
రూలు వుంది రంగూవుంది రూలూ తప్పకు తిరిగే లౌక్యం వుంది ||మేమే ఇండియన్స్||
వందేమాతరం….వందేమాతరం… వందేమాతరం….వందేమాతరం… ||వందేమాతరం.||
చ: కలలు కన్నీళ్లెన్నో మన కళ్ల్ల్లో ఆశయాలు ఆశలు ఎన్నోమన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిల్చినా రక్తం మనదీ ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనదీ
ఈశ్వర్ అల్లా ఏసు …. ఒకడే కదరా బాసు….దేవుడికెందుకు జెండా..కవాలా పార్టీఅండా
మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్చగాళ్ల పనిపట్టు
భారతీయులం ఒకటేనంటూ ఇడికిలెత్తి వెయిఒట్టు
కుట్రలు చేసే శత్రుమూకల తోలు తీసి ఆరబెట్టు
దమ్మేవొంది …ధైర్యంవుంది తలవంచని తెగపొగరుంది ||వందేమాతరం.||

ఆహా అల్లరి

గాయకులు: రకీబ్, చిత్ర
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప: అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయె
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలి గింతాయె ఈ తిక్క గాలివానా
మది ఉక్కిరి బిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలనా
కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా
చ బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటే….
లేలేత నడుములోని మడతా తనముద్దుకై వేచివున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్లలోన చిక్కుకున్నదే
మొత్తం నేలమీద మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడె
కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా
చ: పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతుదీ
కనుచూపే తాకుతుంటే నన్నూ అబ్బనా మనసు పచ్చిగవుతదే… మెరిసే మెరుపల్లే వాడొస్తే అబ్బ గుండెలోన పిడుగు పడుతున్నదే ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇకనాఊపిరాగి పోతదే….
కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా

ఖడ్గం ఖడ్గం

గాయకులు: సిరివెన్నెల
సాహిత్యం: S.P.బాలు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఖడ్గం….ఖడ్గం….ఖడ్గం…..ఖడ్గం.
ఓం కారనాదంతొ అంకురించిన వేద ధాత్రికి సంకేతం ఈ ఖడ్గం.
హ్రీంకార నాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం.
తరతరాలుగా కదలివచ్చిన చరిత ఈ ఖడ్గం.
యుగయుగాలుగ గమనమాగని ఘనత ఈ ఖడ్గం.
తనకళ్లముందెన్నిసామ్రాజ్య శఖరాలు మన్నుపాలైనా
క్షణమై తనగాధ గతములో విడిచి మృతిఒడి చేరనిదీ ఖడ్గం.
పూటకో పడమరను దాటి పూర్వద్రిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ ఖడ్గం.(2)
మూడువన్నెల కేతనముగా మింటికి ఎగసి కాలానికి ఎదురేగు యశోరాశి ఈ ఖడ్గం.
హరిని ధరపై అవతరించిగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం.
నరులోని దైవాంశమే అర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షకై ధరించిన ధీరగుణమీఖడ్గం.
ధూర్త శిక్షణకై వహించిన కరుకుతనమీ ఖడ్గం.
హుంకరించి అహంకరించి అతిక్రమించిన ఆకతాయుల
అంతుచూసిన క్షాత్రస్తత్వం అస్తమించని అర్క ఖడ్గం.
శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్నిజాతుల
పొదువుకున్న ఉదారతత్వం జగపతిమరువని ధర్మఖడ్గం.
నిద్దురమత్తును వదిలించే కెంజాయుల జిలుగీ ఖడ్గం.
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం.
మట్టిని చీల్చుకు చిగురించే సిరిపచ్చని చిగురీ ఖడ్గం.
కెంజాయల జిలుగీ ఖడ్గం….తెలతెల్లని వెలుగీ ఖడ్గం….సిరిపచ్చని చిగురీ ఖడ్గం

గోవిందా గోవిందా

గాయకులు: శ్రీ
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

గోవిందా…గోవిందా…గోవిందాగోవిందా
నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా లోకమంటా ఏలేవాడా
స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా ||గోవిందా||
కో: గోవిందా గోవిందా..అరెబాగు చెయ్ నను గోవిందా
కో: బాగుచెయ్ నను గోవిందా
జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు
పనికిరాని చవటలకిచ్చిపరమబేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి ||గోవిందా||
పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత పుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో
పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు
సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టేక్స్ అడగని ఆస్తులివ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ ||గోవిందా ||
వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాస్ హీరో చాన్సు లివ్వు _ హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న _ సొమ్ములున్న హీరోయిన్నే వైపుగ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు _ హీరోలయ్యే మనవలనివ్వు
నన్నుకూడా సి.ఎం.చెయ్యి లేకపోతే పి.ఎం చెయ్యి
తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైపు నియ్యి
కో: గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
కో: బాగుచెయ్ నను గోవిందా
అరె పైకితేనను గోవిందా
కో: గోవిందా గోవిందా
లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏసి చేస్తా_ ఎయిత్ వండర్ నీగుడి చేస్తా ….||ఏడు|| ||గోవిందా ||
అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ?

Leave a Comment